![]() |
![]() |

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ పైకి కామెడీని పంచుతూ ఆడియన్స్ నవ్విస్తూనే ఉంటాయి. కానీ లోపల ఎన్నో లుకలుకలు ఉన్నాయి...అవేవి పైకి కనిపించవు. ఈ షోస్ ని యాంకర్ రష్మీ, అనసూయ ఉన్నారు. ఐతే అనసూయ కూడా తనకు సెట్ లో ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే నెపంతో బయటకు వచ్చేసి సిల్వర్ స్క్రీన్ మీద ఫిక్స్ ఐపోయింది. తర్వాత సౌమ్య శారదా అనే కన్నడ అమ్మాయిని తీసుకొచ్చారు.
ఐతే ఆమెకు తెలుగు రాకపోయినా చాల స్పాంటేనియస్ గా..ఎలాంటి ఫేక్ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ లేకుండా చాల జెన్యూన్ గా ఉంటూ యాంకరింగ్ చేసేది. కానీ ప్రస్తుతం ఆమెని తీసేసో తప్పించేసో సిరి హన్మంత్ ని యాంకర్ గా తీసుకొచ్చారు. ఇదే విషయం గురించి నెటిజన్స్ సౌమ్యని అడుగుతున్నారు. ఎప్పుడు జబర్దస్త్ కి తిరిగి వస్తారు...అసలు ఎందుకు తీసేసారు అని అడుగుతున్నారు. ఇక ఒక నెటిజన్ ఐతే సుదీర్ఘ మెసేజ్ పెట్టారు. "నా ఉద్దేశ్యం ఏంటంటే సౌమ్య గారూ... ఇప్పటి వరకు జబర్దస్త్ లోని యాంకర్‌లందరూ డ్యాన్స్ కి, ఫేక్ స్మైల్స్ కే పరిమితమయ్యారు...కానీ మీరు అలా కాదు. స్పాంటేనియస్‌గా, హ్యూమరస్ ఉన్న యాంకర్‌గా, హైపర్ ఆదికి కూడా కౌంటర్లు, పంచులు ఇచ్చి వేయగలిగిన ఏకైక యాంకర్ మీరే... అతనికి తిరిగి కౌంటర్ పంచులు ఇవ్వగలింది మీరే..
మీరు ఏదో షో కోసం అన్నట్టుగా చేయకుండా చాలా జెన్యూన్ గా ఆడియన్స్ కోసం నేచురల్ గా చేస్తారు. మిమ్మల్ని బుల్లి తెర మీద మిస్ అవుతున్నాం.. కానీ మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా...వెండితెర మీద మంచి ఛాన్సెస్ రావాలని విష్ చేస్తున్న" అని అన్నారు. ఐతే హైపర్ ఆదికి ఎదురు పంచులు వేస్తోందని సౌమ్యను యాంకర్‌గా తీసేసారా ? సౌమ్యనే వెళ్లిపోయిందో ఇంతవరకు తెలీదు. ఎందుకంటే ఈ షో నుంచి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానీ ఆమె వెళ్ళిపోయింది. ఆ కారణం ఇప్పటివరకు ఎవరూ కూడా రివీల్ చేయలేదు. ఈమెను తప్పించడం వెనుక ఎవరున్నారు ? మల్లెమాల టీం నిర్ణయమా... జబర్దస్త్ డైరెక్షన్ టీం నిర్ణయమా... ? ఎవ్వరికీ తెలియదు. ఆ నెటిజన్ కి సౌమ్య ఇలా రిప్లై ఇచ్చింది. " టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా.. థాంక్యూ సో మచ్ " అని చెప్పింది . అంటే జబర్దస్త్ షోకు సౌమ్య దూరం అవ్వడం వెనక పెద్ద తతంగమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి సౌమ్య ఎప్పుడు నోరు విప్పుతుందో.. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి.
![]() |
![]() |